: బడ్జెట్ కసరత్తు ప్రారంభించాం: సీఎం చంద్రబాబు


ఏపీ బడ్జెట్ కు కసరత్తు ప్రారంభించామని, అన్ని శాఖలతో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ మాట్లాడారని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలో శాఖాధిపతులు, కార్యదర్శులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులూ పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలపై సమీక్ష, బడ్జెట్ పై కసరత్తు, నిధుల వినియోగంపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, జీఎస్టీ వల్ల రాబోయే రోజుల్లో రెవెన్యూ పెరుగుతుందని, క్రమంగా ఆన్ లైన్ లావాదేవీల దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని, సమస్యలు ఉన్నా, రెండంకెల వృద్ధి సాధించామని, సామాన్యుడు సంతృప్తి స్థాయిని అందుకోవడమే ముఖ్యమని చంద్రబాబు అన్నారు.

  • Loading...

More Telugu News