: బంగారు వస్తువులకు నల్లరంగు పూత.. విమానాశ్రయంలో రూ.31,70,000 విలువచేసే బంగారం స్వాధీనం
ముంబై విమానాశ్రయంలో సాధారణ తనిఖీల్లో భాగంగా సోదాలు నిర్వహిస్తోన్న అధికారులు ఈ రోజు ఓ ప్రయాణికుడి నుంచి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. సదరు ప్రయాణికుడు రెండు సిలిండర్ ఆకారం గల బంగారు వస్తువులకు నల్లరంగు పూత పూసి బంగారాన్ని స్మగ్లింగ్ చేసే ప్రయత్నం చేశాడని, దీనిని గమనించి అతడిని అదుపులోకి తీసుకున్నామని అధికారులు మీడియాకు వివరించారు. అతడి వద్ద స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ.31,70,000 ఉంటుందని పేర్కొన్నారు.