: ఎన్టీఆర్ పాత్రను పోషించేది నేనే: మరింత స్పష్టతనిచ్చిన బాలకృష్ణ


తన తండ్రి దివంగత ఎన్టీ రామారావు జీవిత చరిత్రను సినిమాగా తీయబోతున్నానని ప్రకటించిన బాలకృష్ణ, అందుకు సంబంధించిన మరిన్ని విశేషాలను వెల్లడించారు. ఈ చిత్రంలో హీరోగా తానే నటించనున్నానని తెలిపారు. ఎన్టీఆర్ పాత్రను పోషించడం తనకు లభించిన వరమని వ్యాఖ్యానించిన ఆయన, చిత్ర దర్శక, నిర్మాతలను త్వరలోనే ప్రకటిస్తానని నిమ్మకూరులో నేడు వెల్లడించారు. అతి త్వరలోనే మిగతా విషయాలన్నింటినీ తెలియజేస్తానని, హీరోయిన్ల ఎంపిక ప్రక్రియ అసలు మొదలు కాలేదని, ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు సంబంధించిన ఎన్నో అంశాలను అభిమానులు తెలుసుకోవచ్చని అన్నారు. స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని అన్నారు.

  • Loading...

More Telugu News