: రూ. 19,990కి ఎలక్ట్రిక్ స్కూటర్... ఆవిష్కరించిన హీరో కంపెనీ
ఒకసారి చార్జింగ్ చేస్తే, 65 కిలోమీటర్లు ప్రయాణించేలా తయారు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఫ్లాష్'ను హీరో ఎలక్ట్రిక్ మార్కెట్లోకి విడుదల చేసింది. 48 వోల్ట్ 20 ఏహెచ్ వీఆర్ఎల్ఏ బ్యాటరీ సాయంతో గరిష్ఠంగా 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే స్కూటర్ ధర రూ. 19,990 రూపాయలని హీరో ఎలక్ట్రిక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోహిందర్ జిల్ పేర్కొన్నారు. దీని బరువు 87 కిలోలని, మెగ్నీషియం ఎల్లాయ్ వీల్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ ప్రత్యేకమని, పట్టణాలు, నగరాల్లో దగ్గరి ప్రాంతాలకు వెళ్లి వచ్చేందుకు ఇది అత్యంత అనుకూలమని ఆయన అన్నారు.