: రేపటి నుంచి రంగంలోకి పెద్దాయన... శివపాల్ కొత్త పార్టీ ఉండదన్న ములాయం
తన అలకను వీడిన యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తండ్రి, సమాజ్ వాదీ నేత ములాయం సింగ్ యాదవ్, రేపటి నుంచి ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో ఆయనే స్వయంగా వెల్లడిస్తూ, తన సోదరుడు సైతం పార్టీని విడిచిపోరని స్పష్టం చేశారు. అతను కొత్త పార్టీ పెట్టబోరని, ఏదో కోపంలో అలా మాట్లాడి వుండవచ్చని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ, కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని, అఖిలేష్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, కూటమి విజయానికి తామంతా కలసి పని చేస్తామని అన్నారు. కాగా, కాంగ్రెస్ తో పొత్తుపై ఆగ్రహించిన ములాయం, ప్రచారానికి వెళ్లక పోవచ్చని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ములాయం తాజా ప్రకటనతో పొత్తుపై తనకు అసంతృప్తి లేదని ములాయం సంకేతాలు ఇచ్చినట్లయింది.