: త్వరలో 234 మంది యువకులకు ఉద్యోగాలు: తమిళ రాజకీయాలపై క్రికెటర్ అశ్విన్ సెటైర్


తమిళనాడులో శరవేగంగా మారుతున్న రాజకీయాలపై క్రికెటర్ రవిచంద్రన్ ఆశ్విన్ చేసిన ఆసక్తికర ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది. "తమిళనాడులోని అందరు యవకులకూ... త్వరలో 234 ఉద్యోగ అవకాశాలు రానున్నాయి" అంటూ పేర్కొన్నాడు. తమిళనాడులోని అసెంబ్లీ స్థానాలు 234 కాగా, తిరిగి ఎన్నికలు జరిగి, అన్నింటినీ యువత స్వాధీనం చేసుకుంటుదన్న కోణంలో ఉదయం 11:15 గంటల సమయంలో అశ్విన్ పెట్టిన ఈ ట్వీట్ ను వేలమంది తమిళ తంబీలు షేర్ చేసుకున్నారు. ఈ ట్వీట్ కు లైక్ లు కూడా వేల సంఖ్యలో వస్తున్నాయి.

  • Loading...

More Telugu News