: పార్లమెంటు ఆవరణలో గుర్తు తెలియని బ్యాగు కలకలం
ఈ రోజు పార్లమెంటు ఆవరణలో ఓ గుర్తు తెలియని బ్యాగు కలకలం రేపింది. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద బ్యాగుని గుర్తించిన సిబ్బంది వెంటనే బాంబు స్క్వాడ్ అక్కడకు చేరుకొని తనిఖీలు చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. ఇదిలా ఉంచితే, పార్లమెంటు ఉభయసభలు కొనసాగుతున్నాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగిస్తోన్న సమయంలో కేరళకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఇ.అహ్మద్ అస్వస్థతకు గురై అక్కడే కుప్పకూలిపోయి, అనంతరం మృతి చెందిన సంగతి తెలిసిందే. పార్లమెంటు సభ్యుడు మృతి చెందినప్పటికీ బడ్జెట్ ప్రవేశపెట్టారంటూ ప్రతిపక్ష పార్టీలు లోక్‌సభలో గందరగోళం సృష్టిస్తున్నాయి.