: నాలుగు రోజుల పాటు ఎస్ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం


త‌మ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు నాలుగు రోజుల పాటు అందుబాటులో ఉండవ‌ని ఎస్ బ్యాంక్ పేర్కొంది. త‌మ ఖాతాదారుల‌కు ఎటువంటి అంత‌రాయం లేని, ఉన్న‌త‌మైన బ్యాంకింగ్ అనుభ‌వాన్ని అందించే నేప‌థ్యంలో త‌మ‌ సిస్టంను అప్ గ్రేడేషన్ చేస్తున్నట్లు తెలిపిన ఎస్ బ్యాంక్‌.. ఈ కార‌ణంగానే తాము ఈ స‌ర్వీసులు అందించ‌లేక‌పోతున్న‌ట్లు చెప్పింది. ఆ బ్యాంకులో ఖాతాలు ఉన్న వారికి స‌ద‌రు సంస్థ ఇ-మెయిల్ నోటిఫికేషన్లో ఈ విష‌యాన్ని తెలిపింది. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 13తేదీ వ‌ర‌కు తమ ఈ-స‌ర్వీసులు అందుబాటులో ఉండవని ఎస్ బ్యాంక్ పేర్కొంది. త‌మ ఖాతాదారులకు ఈ నాలుగు రోజుల్లో నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్ చెల్లింపులు, ఎస్ఎమ్ఎస్ బ్యాంకింగ్, ఎస్ఎస్డి లాంటి బ్యాంకింగ్ సేవలు అందించ‌లేమ‌ని తెలిపింది.

  • Loading...

More Telugu News