: అనంతపురం చేరుకున్న జగన్.. మహాధర్నా ప్రారంభం
అనంతపురం జిల్లాలోని హంద్రీనీవా ద్వారా ఆయకట్టుకు సాగునీటిని కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఉరవకొండలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించతలపెట్టిన మహాధర్నా ప్రారంభమైంది. ధర్నాస్థలికి వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి చేరుకున్నారు. ఆయనతో పాటు పలువురు వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు ధర్నాలో పాల్గొన్నారు. పట్టణంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు ఈ ధర్నా కొనసాగనుంది. జగన్‌కు మద్దతు తెలిపేందుకు రైతులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. మరికాసేపట్లో వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు.