: అతిపెద్ద రావణుడు ఢిల్లీలో ఉన్నారు: మోదీపై మంత్రి ఆజం ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రావణుడితో పోల్చుతూ యూపీ మంత్రి ఆజం ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న సందర్భంగా చేపట్టిన ప్రచారంలో ఆజం ఖాన్ మాట్లాడుతూ.. 130 కోట్ల మంది భారతీయులను పరిపాలిస్తున్న రాజు ఇటీవల రావణుడి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు లక్నో వెళ్లారని, అయితే ఆ రాజు ఓ విషయం మరిచారని, అతిపెద్ద రావణుడు ఢిల్లీలో నివసిస్తున్నారని, లక్నోలో లేరని ఆయన మోదీని పరోక్షంగా విమర్శించారు. ధనవంతుల ప్రయోజనాల కోసమే మోదీ పనిచేస్తున్నారని, రాష్ట్రంలో అభివృద్ధి పనులు కొనసాగాలంటే సమాజ్‌వాదీ పార్టీకే ఓటు వేయాలని ఆయన అన్నారు.