: శశికళకు వ్యతిరేకంగా సంతకాలు చేస్తున్న వేలాదిమంది నెటిజన్లు!


తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ బాధ్యతలు స్వీకరించడానికి సర్వం సిద్ధమైంది. ప్రస్తుత సీఎం పన్నీర్ సెల్వం చిన్నమ్మ కోసం సీఎం పదవికి రాజీనామా చేసేశారు. దీంతో, తమిళనాట ఉత్కంఠభరిత పరిస్థితి తలెత్తింది. శశికళ ముఖ్యమంత్రి కావడం మెజారిటీ తమిళులకు నచ్చడం లేదు. ఈ నేపథ్యంలో ఛేంజ్.ఆర్గ్ అనే సంస్థ నిన్న రాత్రి నుంచి ఆన్ లైన్ పోల్ ప్రారంభించింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ రానుండటంపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తోంది. ఇది ప్రారంభించిన 15 నిమిషాల్లోపే శశికి వ్యతిరేకంగా 19,000 మంది సంతకాలు పెట్టారట. తామంతా చదువుకున్న, తెలివైన జయకు ఓటు వేశామని, ఇతరులకు కాదని వారు తమ అభిప్రాయాన్ని స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే ఇంకోసారి ఎన్నికలను నిర్వహించండంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ సంతకాలను రాష్ట్రపతి, గవర్నర్ లకు అందజేస్తామని సదరు సంస్థ ప్రతినిధులు తెలిపారు. 35 వేల మంది ఈ పిటిషన్ పై సంతకం చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 32,150 మంది సంతకం చేశారు. 

  • Loading...

More Telugu News