: బ్రష్ చేయలేదని.. కూతురిని కొట్టి చంపిన తల్లి
పళ్లుతోముకోవట్లేదనే కోపంతో తన కూతురిని ఓ మహిళ చితక్కొట్టడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన అమెరికాలోని మేరిల్యాండ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... 20 ఏళ్ల హెర్నాండెజ్ రివాస్‌కు నాలుగేళ్ల చిన్నారి నోహ్లీ అలెగ్జాండ్రా ఉంది. బ్రష్ చేయడం లేదనే కోపంతో తన కూతురిని కడుపుపై తన్నింది. అనంతరం ఆ చిన్నారి బ్రష్ చేసుకునేందుకు బాత్రూమ్‌లోకి వెళ్లింది. అయితే, ఆ చిన్నారి బాత్రూమ్ లో నుంచి ఎంతకీ బయటకు రాలేదు. హెర్నాండెజ్ రివాస్ బాత్రూమ్ వద్దకు వెళ్లి చూడగా చిన్నారి పడిపోయి ఉంది.
వెంటనే రివాస్ పోలీసులకు ఫోన్ చేసింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు చిన్నారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ అలెగ్జాండ్రా మృతిచెందింది. చిన్నారిని కొట్టిన తల్లి రివాస్‌ను అరెస్టు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.