: జగన్ ను ఎన్నడూ బ్లాక్ మెయిల్ చెయ్యలేదు: విజయసాయి రెడ్డి


వైకాపా అధినేత వైఎస్ జగన్ ను తాను ఎన్నడూ బ్లాక్ మెయిల్ చెయ్యలేదని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, తనకు, జగన్ కుటుంబానికి మధ్య ప్రేమాభిమానాలతో కూడిన అనుబంధముందని, బ్లాక్ మెయిల్ అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని అన్నారు. జగన్ అన్ని కేసుల్లో ముద్దాయిగా ఉండి, ఆయన రహస్యాలన్నీ తెలిసుండటం చేతనే, రాజ్యసభ సీటును ఇప్పించుకోగలిగారని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ఆ వార్తలు నిరాధారమైనవని, ఊహాజనితాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను జగన్ ను వీడే సమస్యే లేదని, అన్ని కేసుల నుంచి నిర్దోషులుగా బయటపడతామన్న నమ్మకం ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News