: అమెరికా మార్కెట్లో ట్రంప్ పేరిట డ్రగ్స్.. సీరియస్ గా తీసుకున్న అధికారులు!
అమెరికాలోని డ్రగ్స్ వ్యాపారులు తమ బిజినెస్ కోసం కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖచిత్రాన్ని ముద్రించి ఉన్న కవర్ లో కొకైన్, గంజాయి వంటి మత్తు పదార్థాలను పెట్టి విక్రయాలను సాగిస్తున్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిర్వహించిన దాడుల్లో పలు చోట్ల ఈ ప్యాకెట్లు పట్టుబడ్డాయి. ట్రంప్ పేరుతో జరుగుతున్న వ్యాపారాన్ని చూసిన అధికారులు నివ్వెరపోయారు. మొత్తం 5,500 ట్రంప్ ప్యాకెట్లు వారి దాడుల్లో పట్టుబడ్డాయి. ఈ సందర్భంగా ఫ్లోరిడా అటార్నీ జనరల్ పామ్ బోండి మాట్లాడుతూ, దేశాధ్యక్షుడి ఫొటోను ముద్రించి, ఇలాంటి పనులు చేయడం అతి పెద్ద నేరమని చెప్పారు. ఓ డ్రగ్స్ డీలర్ ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడని తెలిపారు. డ్రగ్స్ ప్యాకెట్స్ ను ట్రంప్ కు కూడా చూపిస్తామని చెప్పారు.