: టీమిండియా రహస్యాలు బయటకు... సీనియర్ల ఫిర్యాదుతో కలకలం
భారత క్రికెట్ జట్టు డ్రస్సింగ్ రూమ్ రహస్యాలను మీడియా మేనేజర్ నిషాంత్ అరోరా బయటకు చేరవేస్తున్నట్టు సీనియర్ ఆటగాళ్లు ఫిర్యాదు చేయడం కలకలం సృష్టిస్తోంది. బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా) అధ్యక్ష పదవి నుంచి తొలగించబడ్డ అనురాగ్ ఠాకూర్ కు ఈ రహస్యాలు వెళుతున్నట్టు ఉన్నతాధికారులకు చెప్పారు. తమకు ఇబ్బంది కలిగించేలా నిషాంత్ ప్రవర్తన ఉందని, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. బోర్డు రద్దయిన తరువాత, కాగ్ మాజీ వినోద్ రాయ్ నేతృత్వంలోని బృందం పర్యవేక్షణలో బీసీసీఐ నడుస్తున్న సంగతి తెలిసిందే.