: డ్యాన్సర్లతో చిందేసిన పోలీసు అధికారి.. మహిళను ముద్దాడిన వైనం!
తాను చేస్తున్న ఉద్యోగాన్ని సైతం మరిచిపోయి ఓ పోలీసు అధికారి జాతరలో డ్యాన్సర్లతో కలసి స్టెప్పులేశాడు. వివరాల్లోకి వెళ్తే, కడప జిల్లా రాజంపేట సబ్ డివిజన్ పరిధిలో ఇతను ఏఎస్ఐగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి జరిగిన జాతరలో డ్యాన్సర్లతో కలసి స్టెప్పులేశాడు. అంతేకాకుండా, ఓ మహిళను స్టేజిపైనే ముద్దు పెట్టుకున్నాడు. వాస్తవానికి ఇలాంటి అశ్లీల నృత్యాలకు పోలీసు అధికారుల అనుమతి లేదు. కానీ, రూ. లక్షకు నెల్లూరుకు చెందిన ఓ నృత్య బృందంతో ఒప్పందం కుదుర్చుకుని రాజంపేట సమీపంలోని కుంపిణీపురానికి తీసుకెళ్లారు. అక్కడ జరిగిన రికార్డింగ్ డ్యాన్సుల్లో ఏఎస్ఐ కూడా ఉత్సాహం తట్టుకోలేక డ్యాన్స్ చేశాడు. దీనిపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి.