: ఢిల్లీలో పోలీసులు, నేరస్తుల మధ్య నడిరోడ్డుపై కాల్పులు.. చిక్కిన గ్యాంగ్‌స్టర్
ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ పోలీస్ స్టేషన్ సమీపంలోని మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర ఈ తెల్లవారుజామున నడిరోడ్డుపై జరిగిన కాల్పులు కలకలం సృష్టించాయి. పోలీసులు, క్రిమినల్స్ మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. చివరికి పోలీసులదే పైచేయి అయింది. అనంతరం పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ అక్బర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అతడి తలపై రూ.25 వేల రివార్డు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అక్బర్ ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి అక్కడ కాపుకాశారు. వారిని గుర్తించిన అక్బర్ 13 రౌండ్ల కాల్పులు జరిపాడు. అక్బర్ పోలీసులకు చిక్కగా అతడితో పాటు ఉన్నవారు పరారయ్యారు.