: అప్పట్లో నన్ను ఓడించింది మీరే కదా.. ఉద్యోగులతో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్య


విజయవాడలో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి మండల విద్యాధికారులు (ఎంఈవో), ప్రధానోపాధ్యాయుల (హెచ్ఎం) సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘అప్పట్లో నేను కాస్త గట్టిగా వ్యవహరించడంతో మీరంతా నాకు వ్యతిరేకంగా పనిచేశారు. నేను ఓడిపోతానని అస్సలు ఊహించలేదు. మీలో చాలామంది నాకు వ్యతిరేకంగా పనిచేశారు. అయితే ఓడిపోయాక తెలిసింది, భయపెడితే పనికాదని, అందరినీ కలుపుకుంటూ పోతే శాశ్వత ఫలితం ఉంటుందని గుర్తించా’’ అని వ్యాఖ్యానించారు. త్వరలో పట్టభద్రుల నియోజక వర్గాల ఎన్నికలు వస్తున్నాయని గుర్తు చేసిన చంద్రబాబు తమకు సహకరించాలని పరోక్షంగా కోరారు. ఉపాధ్యాయుల సమస్యలన్నీ దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఉద్యోగులకు సెలవులు ఇవ్వాలంటే బాధపడేవాడినని, కానీ ఇప్పుడు పండుగలు చేసుకోమని తానే ప్రోత్సహిస్తున్నానని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News