: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శశికళ భర్త.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది


అన్నాడీఎంకే చీఫ్ వీకే శశికళ భర్త ఎం.నటరాజన్ ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో వెంటనే ఆయనను ఓ కార్పొరెట్ ఆస్పత్రికి తరలించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. నటరాజన్‌కు చికిత్స అందిస్తున్న వైద్యులు.. ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన శశికళ ఒకటి రెండు రోజుల్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఆనంద సమయంలో నటరాజన్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడం కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది. విషయం తెలిసిన పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని నటరాజన్ ఆరోగ్య  పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News