: సచిన్ ప్రేరణను యువ క్రికెటర్లందరూ గుర్తుంచుకోవాలి : బ్రియాన్ లారా
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఇచ్చిన ప్రేరణను యువ క్రికెటర్లందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా అన్నాడు. యువ క్రికెటర్లకు నాడు సచిన్ కలిగించిన ప్రేరణ ఎంతగానో ఉందని, ఆ విషయాన్ని వారు గుర్తు చేసుకోవాలని అన్నారు. సచిన్ వారసత్వాన్ని యువ క్రికెటర్లంతా విజయవంతంగా కొనసాగిస్తున్నారని చెప్పిన లారా, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తో పాటు కెప్టెన్సీలో కూడా తన శైలిలో రాణిస్తున్నాడని అన్నాడు. ఒక ఆటగాడిని ఇతర ఆటగాళ్లతో పోల్చి చూసి, వాళ్లలో ఎవరు గొప్ప అని తాను ఎప్పుడూ చెప్పేవాడిని కాదని ఈ సందర్భంగా లారా పేర్కొన్నాడు.