: ‘అన్న’ వర్థిల్లాలి.. ‘అమ్మ’ వర్థిల్లాలి’ అన్న శశికళ.. ‘పన్నీరు’పై ప్రశంసలు కురిపించిన చిన్నమ్మ!
పన్నీరు సెల్వంపై కాబోయే తమిళనాడు సీఎం, అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత శశికళ ప్రశంసలు కురిపించారు. ‘అమ్మ’ జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడు, సోదరుడు పన్నీరు సెల్వం అని, పార్టీ, జయలలిత ఎలా చెబితే అలా ఆయన నడచుకున్నారని అన్నారు. ఏది నిర్దేశిస్తే అది చేశారని, కష్టసమయంలో పార్టీలో కీలక బాధ్యతలు స్వీకరించారని,
‘అమ్మ’ ఆశయాలను, ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన ప్రముఖంగా వ్యవహరించారని, పన్నీరు సెల్వం కోరిక మేరకే తాను శాసనసభాపక్షనేతగా ఎన్నికయ్యానని, ప్రజల కోసమే ప్రభుత్వం అనే విధానాన్ని కొనసాగిస్తామని, పార్టీ నేతలు తనపై ఉంచిన బాధ్యతను తప్పక పాటిస్తానని, ‘అన్న వర్థిల్లాలి. అమ్మ వర్థిల్లాలి’ అని శశికళ పేర్కొన్నారు.