: హైదరాబాద్ లోని కీలక బస్టాండ్లలో ‘మినీ థియేటర్లు’ ఏర్పాటు చేస్తాం: మంత్రి తలసాని
హైదరాబాద్ లోని కీలక బస్టాండ్లలో ‘మినీ థియేటర్లు’ ఏర్పాటు చేస్తామని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పరిపాలన విధానం, ఉద్యమ ప్రస్థానంపై ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ రాసిన పాటను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ చాంబర్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న తలసాని మాట్లాడుతూ, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చిన్న చిత్రాల ఉనికిని కాపాడేందుకు ప్రభుత్వం త్వరలోనే ఐదో ఆటకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. భారతీయ సినిమాల చిత్రీకరణకు హైదరాబాద్ ను కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.