: తాగునీటి సమస్యపై ప్రశ్నించిన ప్రజలపై మండిపడ్డ ఏపీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే!


తాగునీటి సమస్యపై ప్రశ్నించిన ప్రజలపై ఏపీ ఉపముఖ్యమంత్రి చిన రాజప్ప, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ లోని శాటిలైట్ సిటీలో చోటుచేసుకుంది. ఈ కాలనీలో సుమారు నాలుగు రోజుల నుంచి తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మంత్రిని, ఎమ్మెల్యేను ప్రజలు నిలదీయడం జరిగింది. దీంతో, సహనం కోల్పోయిన చినరాజప్ప వారిపై కేకలు వేయగా, ‘తమాషా చేస్తున్నారా?’ అంటూ  బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, అక్కడే ఉన్న ఎంపీ మురళీమోహన్ ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

  • Loading...

More Telugu News