: 7న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న శశికళ


మరో రెండు రోజుల్లో తమిళనాడు మూడో మహిళా ముఖ్యమంత్రిగా  శశికళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 7న ఉదయం 9.30 గంటలకు ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు అన్నా డీఎంకే శ్రేణులు చెబుతున్నాయి. ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. పన్నీర్ సెల్వం మంత్రి వర్గంలోని చాలా మందికి ఉద్వాసన పలుకుతారని, భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ లకు స్థాన చలనం కలుగుతుందని తెలుస్తోంది.

అదేవిధంగా, అన్నాడీఎంకే పార్టీలోని అసంతృప్తులను శశికళ బుజ్జగించనున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. కాగా, తమిళనాడు సీఎంగా తానే కొనసాగాలని భావించిన పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకేలో ఒక వర్గాన్ని ఆయన ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు రావడం, ఈ ప్రయత్నాలు శశికళకు నచ్చకపోవడం తెలిసిందే. సీఎం పదవి నుంచి పన్నీర్ సెల్వంను దింపి ఆ స్థానాన్ని తాను దక్కించుకోవాలన్న శశికళ ప్రయత్నం విజయవంతమవడం గమనార్హం.

  • Loading...

More Telugu News