: అధికారాన్ని చేపట్టేందుకు శశికళ బృందం మిలిటరీ తరహా కుట్రకు పాల్పడుతోంది: దీప
తమిళనాడులో అధికారాన్ని చేపట్టేందుకు శశికళ బృందం మిలిటరీ తరహా కుట్రకు పాల్పడుతోందని దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఆరోపించారు. తమిళనాడుకు శశికళ ముఖ్యమంత్రి అవడం అంటే, ప్రజలకు ఇంతకన్నా దురదృష్టం మరోటి ఉండదని ఆమె వ్యాఖ్యానించారు. కాగా, అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా శశికళ కొద్ది సేపటి క్రితం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనసభా పక్ష నేతగా ఆమె పేరును పన్నీరు సెల్వం ప్రతిపాదించగా, ఆ పార్టీ ఎమ్మెల్యేలు హర్ష ధ్వానాల మధ్య తమ మద్దతు తెలిపారు. ఈ నెల 9 లేదా 10వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.