: సీఎం పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా..తదుపరి ముఖ్యమంత్రిగా శశికళ!
తమిళనాడు సీఎం పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు. తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా శశికళ కొనసాగనున్నారు. జయలలిత మరణించిన రెండు నెలలకు శాసనసభా పక్ష నేతగా శశికళ ఎన్నిక కావడం గమనార్హం. సీఎం పదవిని చేపట్టాలని శశికళను పన్నీర్ సెల్వం కోరారు. శాసనసభా పక్ష తీర్మానాన్ని గవర్నర్ కు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అందించనున్నారు. కాగా, తమిళనాడుకు మూడో మహిళా ముఖ్యమంత్రిగా శశికళ బాధ్యతలు చేపట్టనున్నారు. మరో రెండు మూడు రోజుల్లో తమిళనాడు సీఎంగా ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు.