: అన్నా డీఎంకే శాసనసభాపక్షనేతగా శశికళ ఏకగ్రీవం


 అన్నా డీఎంకే శాసనసభాపక్షనేతగా శశికళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం తొలుత శశికళ పేరును ప్రతిపాదించగా, శాసనసభ్యులు అందుకు తమ మద్దతు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు శాసనసభా పక్షనేతగా ఉన్న పన్నీర్ సెల్వం స్థానంలో శశికళ కొనసాగుతారు. కాగా, తమిళనాడు సీఎంగా శశికళ ఎన్నిక కావడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో, చిన్నమ్మ సీఎం కావడానికి మార్గం సుగమమైనట్లు అయింది. అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం బయట ఆ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా మహిళా కార్యకర్తలు ఆనందోత్సాహాలతో ఉన్నారు.

  • Loading...

More Telugu News