: టికెట్ చెకింగ్ తో భయపడి రైల్లో నుంచి దూకేశాడు.. కాలు కోల్పోయాడు!
టీసీ వస్తున్నాడనే భయంతో ఒక యువకుడు రైల్లో నుంచి దూకేసిన సంఘటనలో అతని కుడికాలు తెగిపోయింది. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం జానకీపురం గ్రామానికి చెందిన కోట నవీన్ (19) నిన్న విజయవాడ నుంచి బోనకల్ కు కాజీపేట ప్యాసింజర్ రైలు లో టికెట్ తీసుకోకుండా వెళ్తున్నాడు. మధిర స్టేషన్ దాటగానే నవీన్ ఉన్న బోగీలోకి టీసీ వెళ్లాడు. దీంతో, తనను టిక్కెట్టు అడుగుతాడనే భయంతో రైలులో నుంచి దూకేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన నవీన్ ను మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచనలతో మరింత చికిత్స కోసం ఖమ్మం తరలించారు.