: అమాయకులపై పాక్ అరాచకాలు... ఇస్లామాబాద్ లో మిన్నంటిన నిరసనలు
తమ దేశపు ప్రభుత్వ తీరును పాకిస్థాన్ వాసులు ఎండగడుతున్నారు. ప్రభుత్వంతో పాటు ఐఎస్ఐ అమాయకులను వేధిస్తూ, అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ, ఇస్లామాబాద్ లో భారీ ప్రదర్శనకు దిగారు. పాక్ ఆక్రమిత కాశ్మీరు నుంచి వచ్చిన వందలాది మంది నిరసనకారులు ఈ ఉదయం ఆందోళన చేపట్టారు. తమ ప్రాంతంలో ఐఎస్ఐ, సైన్యం ప్రజలను తీవ్రంగా ఇబ్బందులు పెడుతోందని వారు ఆరోపించారు. నవాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాలకులపై పాక్ ప్రజలు మండిపడటం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఎన్నోసార్లు ప్రజలు ఇదే తరహా ఉద్యమాలు చేశారు. తమకు స్వాతంత్ర్యం ప్రకటించాలని పీఓకేతో పాటు బెలూచ్ వాసులు సైతం ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఆందోళనలను పోలీసులు, భద్రతా దళాలు అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వాదం, ఆపై లాఠీ చార్జ్ జరిగినట్టు తెలుస్తోంది.