: అమెరికాతో పోరాడలేం... అంత శక్తి లేదన్న 'ఇన్ఫోసిస్' నారాయణమూర్తి
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడే శక్తి భారత ఐటీ కంపెనీలకు లేదని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. ట్రంప్ వైఖరి గురించి ఎన్నికలకు ముందే ఓ అభిప్రాయం ఉందని, ఈ పరిస్థితి రావచ్చని ముందుగానే ఓ అవగాహనకు వచ్చామని ఆయన అన్నారు. ఐటీ కంపెనీలు అమెరికాలోని సెంటర్లలో అక్కడి వాళ్లనే విధుల్లోకి తీసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. ట్రంప్ నిర్ణయాలు ఐటీ భవిష్యత్తుకు విఘాతమేనని, ఇదే సమయంలో స్వశక్తిని చూపించే సమయం వచ్చిందని, భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ట్రంప్ వైఖరితో, విస్తరణ దిశగా మరో మెట్టు ఎక్కే అవకాశం దగ్గరైందని అన్నారు.