: తిరుపతిలో దారుణం.. అనుమానంతో భార్యను గొడ్డలితో నరికిన భర్త
తిరుపతిలో ఘోరం జరిగింది. అనుమానం పెనుభూతమై ఓ మహిళ ప్రాణాలు తీసింది. తమిళనాడు నుంచి కొన్నేళ్ల క్రితం తిరుపతికి వలస వచ్చిన కుటుంబం రూరల్ మండలం గాంధీనగర్‌లో నివసిస్తోంది. ఇటీవల భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్టే శనివారం రాత్రి గొడ్డలితో ఆమెపై దాడిచేసి చంపేశాడు. భార్య తలను మొండెం నుంచి వేరుచేసి పైశాచిక ఆనందం పొందాడు. సమాచారం అందుకున్న ఎంఆర్ పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తల్లి హత్యకు గురికావడం, తండ్రి కటకటాల వెనక్కి వెళ్లడంతో వారి ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.