: ఆ ఏడు దేశాల వారు అమెరికా రావొచ్చు.. కోర్టు ఆదేశాల‌తో వెన‌క్కి త‌గ్గిన ట్రంప్‌.. నిషేధం ఎత్తివేత‌


కోర్టు ఆదేశాల‌తో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. ఏడు ముస్లిం మెజారిటీ దేశాల‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు. చెల్లుబాట‌య్యే వీసాలు ఉన్న‌వారు అమెరికాలో నిర‌భ్యంత‌రంగా కాలుమోప‌వ‌చ్చ‌ని ట్రంప్ స‌ర్కారు ప్ర‌క‌టించింది. ముస్లిం దేశాల‌పై ట్రంప్ విధించిన నిషేధాన్ని తాత్కాలికంగా నిలుపుద‌ల చేస్తూ సియాటెల్ కోర్టు ఆదేశాలు  జారీ చేయ‌డంతో ట్రంప్ ప్ర‌భుత్వం తాజా నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. అయితే సియాటెల్ జిల్లా కోర్టు ఆదేశాల‌ను నిలిపివేయాల్సిందిగా అత్య‌వ‌స‌ర ఆదేశాల కోసం అప్పీలు చేస్తామ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఉంద‌ని, దానిని అమ‌లు చేయాల్సిన బాధ్య‌త కూడా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొన్నాయి. ప్ర‌స్తుతానికైతే ఏడు దేశాల నుంచి వ‌ల‌స‌ల‌ను నిషేధిస్తూ అధ్యక్షుడు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాల‌ను నిలిపివేస్తున్న‌ట్టు విదేశాంగశాఖ ప్ర‌క‌టించింది.

  • Loading...

More Telugu News