: తిరుమలలో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన పూజగది.. భయంతో పరుగులు తీసిన భక్తులు
తిరుమలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శంఖుమిట్ట కాటేజీ 264వ గది వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. భక్తులు గదిలో నిద్రిస్తుండగా మంటలు ఉవ్వెత్తున ఎగసిపడడంతో భయంతో పరుగులు తీశారు. దీనికి తోడు ఆరోగ్యశాఖకు చెందిన డస్ట్‌బిన్లు అక్కడే ఉండడంతో మంటలు మరింత తీవ్రమయ్యాయి. మంటల్లో పూజగది పూర్తిగా దగ్ధమైంది. ఆకతాయిలు ఎవరో సిగరెట్ తాగి వేసినట్టుగా ఫైర్ సిబ్బంది అనుమానిస్తున్నారు. పెను ప్రమాదం తప్పడంతో టీటీడీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.