: ఏపీకి ప్రత్యేకహోదా అవసరమేలేదు: కేశినేని నాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా అవసరమే లేదని టీడీపీ ఎంపీ కేశినేని నాని తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని అన్నారు. ఇక లోక్ సభలో ఎంపీలు ప్రైవేటు బిల్లులు పెట్టడం సర్వసాధారణమని, అలాంటి బిల్లులేవీ ఆమోదం పొందవని ఆయన తెలిపారు. రికార్డుల కోసమే ఇలాంటి బిల్లులు ప్రవేశపెడతారని ఆయన చెప్పారు. హోదాకు సంబంధించిన అన్ని ప్రయోజనాలను రాష్ట్రం పొందిందని ఆయన అన్నారు. నీతిఆయోగ్ సిఫారసులన్నీ పూర్తిగా అధ్యయనం చేసిన తరువాతే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీని కోరారని ఆయన తెలిపారు.