: గోవా, పంజాబ్ లలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు


గోవా, పంజాబ్ లలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. గోవాలో 83 శాతం పోలింగ్ నమోదవ్వగా, పంజాబ్ లో 66 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. ఇంకా క్యూలైన్లలో నిల్చున్న వారిని ఓటింగ్ కు అనుమతిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. కాగా, గత ఎన్నికల సందర్భంగా నమోదైన ఓటింగ్ తో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గిందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ ఎన్నికల ఫలితాలు ఈనెల 11న ప్రకటించనున్నారు. 

  • Loading...

More Telugu News