: ప్ర‌జ‌ల వెన్నులో వ‌ణుకు పుట్టించాడు.. 17 ఏళ్ల‌కే 30 హ‌త్య‌లు చేసిన కుర్రాడు!


అత‌డి వ‌య‌సు 17. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన హ‌త్య‌లు 30. కొలంబియా ప్ర‌జ‌ల వెన్నులో వ‌ణుకు పుట్టిస్తూ త‌ప్పించుకు తిరుగుతున్న ఆ కుర్రాడిని తాజాగా పోలీసులు ప‌ట్టుకొని బాల నేర‌స్తుల జైలుకి త‌ర‌లించారు. ఆ కుర్రాడి గురించి అక్క‌డి పోలీసులు వివ‌రిస్తూ...  ఫ్రిజోలిటో అనే మారుపేరు గల ఆ కుర్రాడు 12 ఏళ్లకే హ‌త్య‌లు చేయ‌డం మొద‌లుపెట్టాడ‌ని తెలిపారు. ఆ వ‌య‌సు నుంచే డ్రగ్స్‌ స్మగ్లింగ్ చేస్తూ ఓ ముఠాకు నాయకుడు కూడా అయ్యాడ‌ని తెలిపారు. త‌నను ప‌ట్టుకోవాల‌ని చూసిన వారిని, తన‌ను ప్ర‌శ్నించిన వారిని చంపేస్తూ ఐదేళ్లుగా రెచ్చిపోతున్నాడ‌ని తెలిపారు. దీంతో కాలి పట్టణ వాసులు అనుక్ష‌ణం తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యే వార‌ని తెలిపారు. కొన్నిరోజుల క్రితం కాలి పట్టణంలోని షాపింగ్‌ మాల్‌ వద్ద ఆ కుర్రాడు ఇద్ద‌రిని హ‌త‌మార్చాడ‌ని చెప్పారు. ఎట్ట‌కేల‌కు త‌మ చేతికి చిక్కాడ‌ని తెలిపారు.

  • Loading...

More Telugu News