: ఆన్ లైన్ వ్యాపారం పేరుతో దోచేసిన ఆ మోసగాడు... బాలీవుడ్ భామలతో పార్టీ చేసుకున్నాడు!
'క్లిక్ కొట్టు.. ఐదు రూపాయలు పట్టు' అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లకు ఎరవేసి 3,700 కోట్ల రూపాయలు దోచేసిన ఘరానా మోసగాడు అనుభవ్ మిత్తల్ వైభవాన్ని తెలిపే ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సోషల్ ట్రేడ్.బిజ్ పేరుతో ఆన్ లైన్ బిజినెస్ ప్రారంభించిన అనుభవ్ మిత్తల్ 'క్లిక్ కు ఐదు రూపాయలు ఇస్తా'మని ప్రకటనలు ఇచ్చాడు. దానిని నమ్మి కాంటాక్ట్ చేసిన వారికి 57 వేల రూపాయలతో సంస్థ బాండ్ తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పేవాడు.
ఏడాది తిరిగేసరికి ఆ మొత్తం వచ్చేస్తుందని, తరువాత రూల్స్ ను బట్టి రిఫండ్ చేస్తామని చెప్పేవాడు. దీంతో ఈ వ్యాపారం పట్ల నెటిజన్లు బాగా ఆకర్షితులయ్యారు. అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తాడు. దీంతో తన 29వ పుట్టిన రోజు వేడుకలకు అమీషా పటేల్, సన్నీలియోన్ లను అతిథులుగా పిలిచి పార్టీ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అలాగే కార్లు, పార్టీలన్నా అనుభవ్ కు పిచ్చి. భారీ ఎత్తున స్థిరాస్తులు (ఇళ్లు) కూడా సంపాదించినట్టు పోలీసులు పేర్కొంటున్నారు.