: మేయర్ స్వరూప, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరిలకు మెసేజ్ లు పంపి బెదిరించిన మహిళ
అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ ఎం. స్వరూప, ఎమ్మెల్యే వి.ప్రభాకర్‌చౌదరిలకు ఇటీవల ఒకరు బెదిరింపు మెసేజ్‌లు పంపుతుండడం కలకలం రేపింది. తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలి పదవికి స్వరూప రాజీనామా చేయాలని, లేకపోతే ఆమె అంతుచూస్తామని అందులో పేర్కొన్నారు. దీనిపై ఆమె తీవ్రంగా స్పందిస్తూ ఎస్పీ రాజశేఖరబాబుకు క్యాంపు కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సెల్‌ఫోన్ ద్వారా ఆ బెదిరింపు మెసేజ్‌లు పంపింది ఓ మహిళ అని తేల్చారు. సదరు మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు మీడియాకు తెలపనున్నారు.