: ఎర్రన్నాయుడి కుటుంబానికి రామానాయుడి పరామర్శ
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడిపై ప్రముఖ సినీ నిర్మాత రామానాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ఒక మహానేత అని కీర్తించారు. రామానాయుడు ఈరోజు ఉదయం ఎర్రన్నాయుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా, ఆయన ఎర్రన్నాయుడితో తన సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు.