: 2019 వరల్డ్ కప్ లక్ష్యంగా జట్టులో మార్పులు: పాకిస్థాన్ చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్
మరో రెండేళ్లలో జరిగే వన్డే వరల్డ్ కప్ కొట్టడమే లక్ష్యంగా తాము తమ దేశ జట్టును తీర్చిదిద్దుతున్నామని పాక్ క్రికెట్ చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ అన్నాడు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాము ప్రస్తుతం అందుకోసం తమ జట్టులో మార్పులు చేస్తున్నట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలోనే తమ క్రికెట్ జట్టు కెప్టెన్ల అంశంపై చర్చిస్తున్నామని అన్నాడు. ప్రస్తుతం తమ ముందు ఉన్న లక్ష్యం 2019 వరల్డ్ కప్ మాత్రమేనని ఆయన అన్నాడు. తమ జట్టులో ప్రస్తుతం అందరి ప్రదర్శన పేలవంగా ఉందని, జట్టులో సీనియర్ ఆటగాళ్లు కూడా అంతగా ఆకట్టుకోవడం లేదని చెప్పాడు. 2019 వరల్డ్ కప్ నాటికి జట్టు కూర్పు ఎలా ఉండాలి? అనే అంశంపై తాము తీవ్రంగా శ్రమిస్తున్నామని అన్నాడు.