: భారత్ లో గెలవాలంటే విపరీతంగా శ్రమించక తప్పదు: మ్యాక్స్ వెల్
త్వరలో భారత పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా జట్టుకు పలువురు క్రికెట్ దిగ్గజాలు, ఆటగాళ్లు ఎన్నో సలహాలు ఇస్తున్నారు. ఇదే కోవలో ఆసీస్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇండియాలో రాణించాలంటే ముఖ్యంగా స్పిన్ ను ఎదుర్కోవడంపై కసరత్తు చేయాలని చెప్పాడు. ఉపఖండం పిచ్ ల పై రాణించాలంటే స్పిన్ ను దీటుగా ఎదుర్కోవాలని తెలిపాడు. స్పిన్ ను ఎలా ఆడాలో టీమిండియాను చూసి నేర్చుకుందామని చెప్పాడు. ఇండియా గడ్డపై ఆడేటప్పుడు పరిస్థితులు తమకు అనుకూలంగా ఉంటాయనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని... స్కోరు బోర్డుపై వీలైనన్ని ఎక్కువ పరుగులు ఉంచాలంటే విపరీతంగా శ్రమించక తప్పదని అన్నాడు. భారత పిచ్ లపై ఆడిన సందర్భాల్లో... మ్యాచ్ చేతుల్లోకి వచ్చి, చేజారిన సందర్భాలు చాలా ఉన్నాయని గుర్తు చేసుకున్నాడు.