: బీజేపీలో చేరనున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి


కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి.. కార్ణాటక ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలను నిర్వహించిన ఎస్ఎం కృష్ణ గత వారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ... కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ కూడా పంపారు. ఈ నేపథ్యంలో, ఆయన తదుపరి కార్యాచరణ ఏమిటనే సందేహం అందర్లోను మెదులుతోంది. దీనికి సమాధానాన్ని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తెలిపారు. ఎస్ఎం కృష్ణ బీజేపీలో చేరుతున్నారని యెడ్డీ ప్రకటించారు. బీజేపీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారని, అయితే తేదీని ఇంకా ఖరారు చేయలేదని చెప్పారు. త్వరలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఎస్ఎం కృష్ణ రాక తమకు లాభిస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News