: 50 వెబ్ సైట్లు, యాప్ లపై కొరడా ఝుళిపించిన కేంద్ర ప్రభుత్వం


జనాల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్న వెబ్ సైట్లు, యాప్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. మొత్తం 38 వెబ్ సైట్లు, 12 యాప్ లపై నిషేధం విధించింది. చట్ట వ్యతిరేకంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్న ఈ యాప్ లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. అంతేకాదు సదరు వెబ్ సైట్లను కూడా మూసేయాల్సిందిగా ఆధార్ ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఆదేశాలు జారీ చేసింది. ఈ వివరాలను యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే తెలిపారు. ఆధార్ వివరాల్లో కూడా మార్పులు చేర్పులు చేస్తామంటూ ఈ యాప్ లు, వెబ్ సైట్లు ప్రకటిస్తున్నాయని... యూఐడీఏఐ అధికారిక వెబ్ సైట్లో తప్ప మరే ఇతర వెబ్ సైట్లో ఆధార్ నమోదు, మార్పులు చేర్పులు చట్టవిరుద్ధమని ఆయన తెలిపారు. ఇలాంటి యాప్ లు, వెబ్ సైట్ల పట్ల ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.  

  • Loading...

More Telugu News