: ఖైదీ నంబర్ 150లో నటించడం ఎంతో ఆనందంగా ఉంది: ‘జబర్దస్త్’ నటుడు
పాప్యులర్ కామెడీ షో ‘జబర్దస్త్’లో సుడిగాడు సుదీర్ టీమ్‌లో నటిస్తూ నవ్వులు పూయిస్తోన్న రామ్‌ప్రసాద్ సింహాచలంలో జరిగిన తన సోదరి వివాహానికి కుటుంబ సమేతంగా వచ్చి వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు వస్తోన్న సినీ అవకాశాల పట్ల హర్షం వ్యక్తం చేశాడు. మెగాస్టార్ నటించిన 150వ చిత్రం ఖైదీ నంబర్ 150లో నటించటం తనకు ఓ మధురానుభూతిని మిగిల్చిందని ఆయన చెప్పాడు. అనంతరం నానీ హీరోగా నటించిన నేను లోకల్ సినిమాలోనూ తాను మంచి పాత్ర పోషించానని, హీరోకి మిత్రుడిగా పూర్తిస్థాయి పాత్రలో నటించానని అన్నాడు. నాగార్జున హీరోగా తెరకెక్కిన భక్తిరస చిత్రం 'ఓం నమో వేకటేశాయ'లో కూడా తాను కనపడతానని, హీరో రామ్ శివమ్ సినిమాలోనూ తాను నటించానని గుర్తు చేసుకున్నాడు. అంతేగాక తన చేతిలో ఇప్పుడు మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయని అన్నారు.