: మెచ్యూరిటీ లేక అప్పట్లో తప్పు చేశా: కాజల్
'ఖైదీ నంబర్ 150' సినిమా అఖండ విజయం సాధించడంతో ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన కాజల్ అగర్వాల్ ఆనందంలో మునిగితేలుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ, సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో మెచ్యూరిటీ లేక చెత్త చిత్రాల్లో నటించి, మార్కెట్ పోగొట్టుకున్నానని చెప్పింది. ఇప్పుడు మాత్రం మంచి పాత్రలను మాత్రమే అంగీకరిస్తున్నానని, క్రమశిక్షణతో నటిస్తున్నానని తెలిపింది. మరోవైపు సీనియర్ హీరోలతో నటించడానికి కాజల్ సంకోచిస్తోందని, యువ హీరోలతో నటించడానికే ఆమె మొగ్గుచూపుతోందనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. మామూలుగా అయితే ఆమె పారితోషికం కోటిన్నర అట. మెగాస్టార్ తో నటించడానికి కోటి ముప్పావు తీసుకున్నట్టు ఫిలింనగర్ టాక్. తాజాగా మరో సీనియర్ హీరోతో నటించే అవకాశం వచ్చినప్పటికీ... మెగాస్టార్ సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్ నే ఇవ్వాలని ఈ అమ్మడు డిమాండ్ చేసిందట. దీంతో, సదరు నిర్మాత గుడ్ బై చెప్పాడని అంటున్నారు.