: ఒకే సోఫాలో నవ్వులు చిందిస్తూ.. చంద్రబాబు, కేసీఆర్
ఇద్దరు చంద్రులు మరోసారి కలుసుకున్నారు. నందమూరి రామకృష్ణ కుమారుడి వివాహ రిసెప్షన్ హైదరాబాదులోని నొవాటెల్ హోటల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లు హాజరయ్యారు. వీరిద్దరూ ఒకే సోఫాలో కూర్చొని, నవ్వుతూ ముచ్చటించుకున్నారు. ఎంతో ఆనందంగా మాట్లాడుకుంటున్న వీరిద్దరినీ చూసి చుట్టుపక్కల వారంతా ఆనందంలో మునిగిపోయారు. అనంతరం వీరిద్దరూ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు బాలకృష్ణ దంపతులు, చిరంజీవి, సీనియర్ నటి జమున, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, ఎంపీ సుబ్బరామిరెడ్డి, నారా లోకేష్ దంపతులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.