: కాకినాడలో హల్ చల్ చేసిన కాజల్
హీరోయిన్ కాజల్ కాకినాడలో హల్ చల్ చేసింది. చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150'లో మెగాస్టార్ పక్కన స్క్రీన్ పంచుకున్న ఈ అందాల భామ... సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకుంటుంటుంది. తాజాగా క్యాన్సర్ బాధితుల కోసం కాకినాడలో నిర్వహించిన ఓ అవగాహన ర్యాలీ కార్యక్రమానికి కాజల్ హాజరైంది. క్యాన్సర్ మహమ్మారిపై జనాల్లో అవగాహన కల్పించడంలో భాగమైనందుకు తనకు చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా కాజల్ తెలిపింది. ప్రస్తుతం తమిళంలో అజిత్, విజయ్ ల సరసన ఈ అమ్మడు సినిమాలు చేస్తోంది.