: మాకు మళ్లీ ఒబామానే కావాలి.. ఎక్కువమంది అమెరికన్ల మనోగతమిదే!
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పగ్గాలు చేపట్టి రెండు వారాలైనా కాకముందే అమెరికన్ల మనసులు మారిపోయాయి. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తిరిగి అధ్యక్షుడు అయితే ఎంత బాగుండునో అంటూ అమెరికన్లు తమ మనోగతాన్ని బయటపెట్టారు. పబ్లిక్ పాలసీ పోలింగ్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. ఎక్కువ మంది అమెరికన్లు తమకు తిరిగి ఒబామానే అధ్యక్షుడిగా కావాలని కోరుకుంటున్నారు. ట్రంప్‌ను ఉన్నపళాన తొలగించాలని ఎక్కువమంది ఓటర్లు కోరుకుంటున్నారు. 52 శాతం మంది ఓటర్లు అయితే తిరిగి ఒబామానే తమకు అధ్యక్షుడిగా కావాలని కోరుకున్నారు. ట్రంప్‌తో తాము సంతోషంగానే ఉన్నామని 43 శాతం మంది పేర్కొన్నారు. ట్రంప్ ట్రావెల్ బ్యాన్‌ను 47 శాతం మంది అంగీకరించగా 49 శాతం మంది మాత్రం వ్యతిరేకించారు. ట్రంప్‌ను సాగనంపాలనే ఎక్కువమంది కోరుకుంటున్నట్టు పబ్లిక్ పాలసీ పోలింగ్ అధ్యక్షుడు డీన్ డేబ్నం పేర్కొన్నారు.