: హైద‌రాబాద్‌లో రెచ్చిపోయిన నైజీరియ‌న్లు.. పోలీసుల‌పై దాడికి య‌త్నం


హైద‌రాబాద్‌లో నైజీరియ‌న్లు రెచ్చిపోయారు. పోలీసుల‌పై త‌మ ప్ర‌తాపం చూపించారు. చివ‌రికి క‌ట‌క‌టాల వెన‌క్కి వెళ్లారు. శుక్ర‌వారం అర్ధ‌రాత్రి పోలీసులు న‌గ‌రంలోని ప‌లుచోట్ల డ్రంకెన్ డ్రైవ్ నిర్వ‌హించారు. ఫిలింన‌గ‌ర్‌లో బ్రీత్ అనలైజ‌ర్ ప‌రీక్షను నిర్వ‌హిస్తున్న పోలీసుల‌పై నైజీరియన్లు తిర‌గ‌బ‌డ్డారు. ఆ ప‌రీక్ష చేసుకునేది లేదంటూ రోడ్డ‌పై బైఠాయించారు. అంతేకాదు పోలీసులపై దాడికి యత్నించారు. దీంతో కొంత‌సేపు ఆ ప్రాంతంలో తీవ్ర గంద‌రగోళం నెల‌కొంది. ఎట్ట‌కేల‌కు పోలీసులు నైజీరియ‌న్ల‌ను అదుపులోకి తీసుకుని  స్టేష‌న్‌కు త‌ర‌లించారు. మ‌ద్యం తాగి వాహ‌నాలు న‌డుపుతూ ప‌ట్టుబ‌డిన మ‌రికొంద‌రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని, ప‌లు వాహ‌నాల‌ను సీజ్ చేశారు.


  • Loading...

More Telugu News