: ప్ర‌శాంతంగా ప్రారంభ‌మైన పంజాబ్, గోవా ఎన్నిక‌ల పోలింగ్‌


పంజాబ్‌, గోవాల‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ఈ ఉద‌యం ప్రశాంతంగా ప్రారంభ‌మైంది. పంజాబ్‌లోని 117, గోవాలోని 40 స్థానాల‌కు కొద్దిసేప‌టి క్రితం పోలింగ్ ప్రారంభమైంది. ఉద‌యం 7 గంట‌ల నుంచే పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఓట‌ర్లు బారులుదీరారు. పోలింగ్ సంద‌ర్భంగా పోలీసులు గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నిక‌ల్లో తొలిసారి పోస్ట‌ల్ బ్యాలెట్ల‌కు బ‌దులు ఈ-బ్యాలెట్‌ను ఉప‌యోగిస్తున్నారు. అలాగే జ‌వాన్ల స‌హా వివిధ స‌ర్వీసు ఉద్యోగులు ఈ-బ్యాలెట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఓటుహ‌క్కు వినియోగించుకోనున్నారు. ఇక గోవాలో 40 స్థానాల‌కు 251 మంది, పంజాబ్‌లో 117 స్థానాల‌కు 1145 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. మార్చి 11న ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి.

  • Loading...

More Telugu News